స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్‌ సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 27, 2021, 04:34 PM
 

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కనున్నాయి. దాదాపు 1,564 గదులు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. వీటిని కంపెనీలు ఐదేళ్ల కాలంలో పూర్తి చేయనున్నాయి.