టీడీపీ నేత పట్టాభిని కోర్టు కు తరలించిన పోలీసులు

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 21, 2021, 03:55 PM
 

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రతినిధి పట్టాభి రామ్ ను కోర్టుకు తరలించారు ఏపీ పోలీసులు. కాసేపటి క్రితమే మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పట్టాభి రామ్ హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ఆయన కేసుకు సంబంధించిన విచారణ మరికొద్ది సమయాల్లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.భారీ బందోబస్తు మధ్య లో… తెలుగు దేశం పార్టీ పట్టాభి ని విజయవాడ లోని మూడవ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు కు తరలించారు పోలీసులు. మధ్యలో టీడీపీ శ్రేణులు అడ్డుపడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు.


కాగా పట్టాభి రామ్ నిన్న అరెస్ట్ అయ్యారు. పట్టాభి ఇంటి తలుపులు పగల కొట్టి మరీ అరెస్టు చేశారు పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం లో పట్టాభి రామ్ ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఇక అటు టిడిపి కార్యాలయాలపై వైసీపీ చేసిన దాడికి నిరసనగా.. చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారు.