భూపాల్: భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్ విమానం మధ్యప్రదేశ్లో కుప్పకూలింది. ఆ రాష్ట్రంలోని బేండ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ విమానంలో ఉన్న పైలట్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. బేండ్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్కాబాద్ ఖాళీ భూముల్లో విమాన శిథిలాలు పడ్డాయి. ఫైటర్ జెట్ కూలిన ప్రదేశాన్ని పోలీసులు కార్డెన్ చేశారు. విమానానికి చెందిన తోక భాగం సగం భూమిలోపలకి చొచ్చుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉన్నది.