జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలలో CITU చిత్రపురి సాధన సమితి కే మా ఓటు

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 08, 2021, 09:09 PM
 
గత రెండు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు అవరోధాలను తట్టుకుని నిలబడ్డ చిత్రపురి మహా పోరాటం మరియు దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు సారధ్యంలో జూనియర్ ఆర్టిస్ట్ లో జరుగుతున్న అవినీతి పైన అలుపెరగని పోరాటం చేస్తున్న సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కస్తూరి శ్రీనివాస్ డాక్టర్ సిహెచ్ భద్ర సిఐటియు హైదరాబాద్ నగర అధ్యక్షులు ఈశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు గారు కోశాధికారి  వాని గారి సారథ్యంలో ఉదయం 5 గంటలకు జూనియర్ ఆర్టిస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో అభ్యర్థులను పరిచయం చేసి తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకు జూనియర్ ఆర్టిస్టులు దాదాపు 800 మంది భారీ ఎత్తున పాల్గొని చిత్రపురి సాధన సమితి సిఐటియు మాకు అండదండగా ఉంటుందని వారంతా హర్షం వ్యక్తం పరిచారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి అనకొండ తిమింగలం జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ యొక్క హక్కులను కాలరాస్తూ అధికారులను రాజకీయ పార్టీ నాయకులు అడ్డుపెట్టుకొని చిత్రపురి లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ప్రస్తుత జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లభనేని అనిల్ కుమార్ చౌదరి వెంటనే అరెస్టు చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ తూ.గో దీక్ష అభ్యర్థి sankuri రవీందర్ మాట్లాడుతూ తూ ఆనాడు తినడానికి తిండి లేకుండా రోడ్ల మీద తిరుగుతూ అందరికీ పక్క లేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న అనిల్ ను  తీసుకొచ్చిన పాపానికి అడ్డదారుల్లో అడ్డదిడ్డంగా ఆఫీస్ బాయ్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు చిత్రపురి కాలనీని అవినీతి సామ్రాజ్యానికి అడ్డాగా మలుచుకుని మా జూనియర్ ఆర్టిస్ట్ పొట్ట కొడుతున్నారు అని కన్నీటి పర్యంతమయ్యాడు. తన ఎన్నికల గుర్తు బస్సు గుర్తు పై జూనియర్ ఆర్టిస్ట్ అంత ఓటు వేసి తమ భవిష్యత్తు తలరాతను తామే మార్చుకోవాల్సిన బాధ్యత తక్షణం జూనియర్ ఆర్టిస్ట్ అందరిపైనా ఉందని రవీందర్ పేర్కొన్నాడు. అనంతరం ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రమా వేణి అలియాస్ ఎల్బీనగర్ స్వప్న  మాట్లాడుతూ ప్రస్తుతం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గా చలామణి అవుతున్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో స్వామిగౌడ్ అనిల్ రవి ముగ్గురు మహిళల మహిళల తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఈ ముగ్గురు దొంగలు ని తరిమి తరిమి కొట్టి మన హక్కులు మనం సాధించుకుందాం అన్నారు ముఖ్యంగా మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు ప్రతినిత్యం బ్రిటిష్ పద్ధతులను పాటిస్తున్న వీరిని ఎర్రజెండా నీడలో తరిమి తరిమి కొడదామని పిలుపునిచ్చారు. అనంతరం కోశాధికారి అభ్యర్థి అశోక్ బెజవాడ గారు మాట్లాడుతూ నేను దాదాపుగా 120O సినిమాలో పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి పట్టుమని పది సినిమాల్లో కూడా నటించారు ఇప్పటిదాకా అసలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వాళ్లే కాదు నిజమైన మన సినిమా కార్మికులు జూనియర్ ఆర్టిస్ట్ అందరం సిఐటియు చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో గుర్తుకు ఓటు వేసి ఈ అవినీతి స్వార్థపరులను దొంగలను జోకర్ బ్రోకర్ లను తరిమి తరిమి కొడదాం ఆనాటి మన్యం వీరుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తితో అందరం బాణాలు బట్టి ఈ దొంగల ని జూనియర్ ఆర్టిస్ట్ వ్యతిరేక ద్రోహులని బాణాలు ఎక్కుపెట్టిన తరిమి తరిమి కొడదాం గుర్తుకు ఓటు వేసి ఈ బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని నేను మీ అందరికీ తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో చిత్రపురి సాధన సమితి నాయకులు నాయకులు మరియు సిఐటియు నగర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు ఇక ఈ బానిస బతుకు మాకు ఎర్రజెండా నీడలో పోరు బాట పడతామని ప్రతిజ్ఞ చేశారు చేశారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లయితే వారికి చెప్పులతో సత్కారం చేసి చెప్పుల దండ వేసి తరిమి కొడదామని పిలుపునిచ్చారు.