ఏపీ మంత్రికి 'పవన్' స్ట్రాంగ్ వార్నింగ్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 02:10 PM
 

మంచో చెడో… వేదిక ఏదైనా – సందర్భం మరేదైనా – పవన్ మైకందుకున్నారు – తన వాదన గట్టిగా వినిపించారు – తాను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేప్రయత్నం చేశారు – తమ పర భేదం లేదంటూ అన్నకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు – ఇక ఏపీ మంత్రిపై “సన్నాసి” అనే పదప్రయోగం చేశారు – ప్రభుత్వ తీరును ఎండగట్టారు – “రిపబ్లిక్” మాటున జగన్ సర్కార్ ని ఏకేశారు – ఫైనల్ గా నిప్పులు చెరిగారు!


తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ.. ముఖ్యంగా ఏపీలో థియేటర్లు ఓపెన్ కాకుండా ఎదుర్కొంటున్న సమస్య గురించి పవన్ ప్రస్తావించారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నానని మొదలుపెట్టిన పవన్… “మన మీద ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు బలంగా మాట్లాడాలి.. మాట్లాడే హక్కు మనకు ఉంది.. మీరు దోపిడీలు చేయట్లేదు.. దొమ్మీలు చేయటం లేదు.. కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడో మీరు అలానే కష్టపడుతున్నారు. చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్ రాజు కాదు.. ఒక అల్లు అరవింద్.. సురేశ్ బాబుకాదు. చాలామంది ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.


అనంతరం ఏపీ మంత్రి పేర్ని నానిపై ఫైరయ్యారు పవన్. “అక్కడెవరో మినిస్టర్ ఉన్నారు. పేరు మర్చిపోయాను” ఇంతలోనే జనాల నుంచి స్పందన వచ్చింది… “ఆ… సన్నాసే… ఆ సన్నాసే. ఆ సన్నాసి పేరు గుర్తుకు రాలేదు. ఆ సన్నాసి అనే మాటేమంటే.. మా నాయకులకి చిరంజీవిగారంటే సోదర భావన అని. సోదర భావన.. సోదర భావన ఏందిరా.. సోదిలో సోదర భావన. ఉపయోగపడని సోదర భావన.. చిత్రపరిశ్రమకు అక్కరకు రాని సోదర భావన దేనికి? దిబ్బలో కొట్టుకోవటానికా?” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.


అనంతరం చిరంజీవి తీరును సుత్తిమెత్తగా తప్పు పట్టేప్రయత్నం చేశారు పవన్! “ఈ మధ్యన అన్నారు నాతో.. ఎందుకండి చిరంజీవి వాళ్లను బతిమిలాడుకుంటారు అని. నేను చెప్పాను.. ఆయనది మంచి మనసయ్యా.. అలా బతిమిలాడుకుంటారు” అని వ్యాఖ్యానించారు. “మన మీద ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు బలంగా మాట్లాడాలని.. మాట్లాడే హక్కు ఉందని గ్రహించాలి.. గట్టిగా మాట్లాడాలి.. మాట్లాడకుండా ఉంటే ఎలా? అని తన సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్!