నెల్లూరు లో పట్టుబడ్డా రేషన్ బియ్యం

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 12:25 PM
 

నెల్లూరు జిల్లాలలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వింజమూరు మండలం కిస్తీపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. లారీలో రవాణా చేస్తున్న 8 టన్నుల రేషన్ బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు, ఏఎస్ పేట మండలాల్లో సేకరించిన రేషన్ బియ్యం రీసైక్లింగ్‌కి కావలికి తరలిస్తున్నారు. స్మగ్లింగ్ చేసే బియ్యాన్ని మిల్లర్లు అధిక ధరలతో అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.