ఓకే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఎంపీటీసీలు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 22, 2021, 12:05 PM
 

నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవుతున్నాయి. పూర్వకాలంలో ఎన్నో పెద్ద పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు గానే కొనసాగుతూ ఉండేవి. రాను రాను ఈ కంప్యూటర్ యుగంలో 'ఎవరికి వారే యమునా తీరే' అని విధంగా పెళ్లి అయినా మొదటి ఏడాదిలోనే తల్లిదండ్రులను తన బంధువులను విడిచిపెట్టి వేరే ప్రపంచంలోకి వెళ్లి పోతున్నారు.


అయితే.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగిన ఓ ఘటన ఇంకా ఉమ్మడి కుటుంబాలకు సాక్ష్యంగా మిగిలాయి. దీనికి నిదర్శనమే సారవకోట మండలంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కోడళ్ళు కలిసికట్టుగా తమ భర్తలతో పాటు ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు డి ఎస్ సి పూర్తి చేశారు.


అయితే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో స్థానికంగా ఉన్న మాజీ ఎంపీపీ నేడు ఎంపీపీ పదవి బాధ్యతలు స్వీకరించనున్న చిన్నాల కూర్మి నాయుడు మాట మేరకు ఆ ఇద్దరు కోడళ్ళు ఎంపీటీసీ ఎన్నికలలో బరిలో దిగారు. ఆ ఇద్దరే జెమినీ వలస కళ్యాణి, కిట్టాలపాడు విజయలక్ష్మి.


వీరిద్దరిలో ఒకరు ఎంపీటీసీగా ఏకగ్రీవంకాగా.. మరొకరు భారీ మెజార్టీతో ఎంపీటీసీగా నెగ్గారు. జెమినీ వలస కళ్యాణి మాలువ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, చిన్న కిట్టాల పాడు నుండి భారీ మెజార్టీతో విజయలక్ష్మి గెలుపొందారు. వీరిద్దరి గెలుపు ఇంకా మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కొనసాగుతున్నాయి అన్నదానికి నిదర్శనంగా, ఆదర్శంగా నిలిచారు.