నేడు పరిషత్ ఎన్నికల ఫలితాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 19, 2021, 08:54 AM
 

ఏపీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 958 హాళ్లలో కౌంటింగ్​కు ఏర్పాట్లు చేశారు. 13 జిల్లాల్లో ఐఎఎస్ అధికారులు పరీశీలకులుగా ఉంటారు. కౌంటింగ్ హాళ్లలోనూ సీసీటీవీ కెమెరా నిఘా, 144 సెక్షన్​ అమలులో ఉంటుంది. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. 9,672 స్థానాలకుగానూ 2,371 చోట్ల ఏకగ్రీవం కాగా, నామినేషన్ తర్వాత 81 మంది అభ్యర్థులు మృతి చెందారు. దీంతో 7,220 చోట్ల మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.


ఎన్నికల్లో మొత్తం 18,782 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 660 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 8 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 11 మంది అభ్యర్ధులు మృతి చెందారు. దీంతో 515 చోట్ల మాత్రమే జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగింది. పోటీలో 2058 అభ్యర్థులు ఉన్నారు.