బెజవాడ రౌడీ షీటర్‌పై నగర బహష్కరణ వేటు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 10:42 PM
 

విజయవాడ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీ షీటర్‌పై నగర బహష్కరణ వేటు వేస్తూ సీపీ బత్తిన శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ కమిషనరేట్‌లో రౌడీ షీటర్ షేక్ సంధానిపై నగర బహుష్కరణ వేటు పడింది. పెనమలూరు పీఎస్‌లో షేక్ సంధానిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై సీపీ బత్తిన శ్రీనివాస్ ఉక్కుపాదం మోపుతున్నారు.