అయోధ్య రామాలయం కోసం 115 దేశాల జలం సేకరణ

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 10:32 PM
 

అయోధ్యలో నిర్మాణం అవుతోన్న భవ్య రామాలయం కోసం దేశదేశాల నుంచీ పవిత్ర జలాలు తరలిస్తున్నారు. మొదటి విడతలో భారతదేశానికి వచ్చిన 115 దేశాల నీటిని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అందుకున్నారు. ఆయనతో పాటూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కూడా ఉన్నారు.


ఈసారి వచ్చిన జలాలు 115 దేశాల్లోని వివిధ నదులు, వాగులు, జలపాతలకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే, ''అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తయ్యేలోపు ఇతర దేశాల నుంచీ కూడా పవిత్రమైన నీరు భారతదేశానికి చేరుకుంటుందని భావిస్తున్నా''నంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఇలా ప్రపంచంలోని వీలైనన్ని ఎక్కువ దేశాల జలం, మందిర నిర్మాణంలో వాడటం ద్వారా, 'వసుధైవ కుటుంబకం' అన్న సందేశాన్ని ప్రతిబింబించాలన్నదే ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు.