వదినపైనే కన్నేసిన మరిది..ట్విస్ట్ ఏంటంటే..!

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 08:33 PM
 

తల్లిలాగా భావించాల్సిన సొంత వదిన పైనే కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్న ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వాడు. చివరికి అతడు కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం రాగిమాకులపల్లె పంచాయితీ పరిధిలోని ప్యాడరాసిపల్లెలో గంగిరెడ్డి అనే యువకుడు ఉంటున్నారు. గంగిరెడ్డికి అన్న వదినలు ఉన్నారు. ఒకే గ్రామంలో ఉండటంతో తరచూ అన్నా వదినలు ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఇదే క్రమంలో తల్లిలాగా భావించాల్సిన సొంత వదిన పైనే కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్న ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వాడు. అనుకోకుండా అలా జరిగి ఉంటుందని భావించిన ఆమె ఏమీ జరగనట్లు మౌనంగా ఉండిపోయేది. తరచూ ఇలా గంగిరెడ్డి చేస్తున్న అసభ్య ప్రవర్తనతో విసుగు చెందిన ఆ మహిళ పలుసార్లు మరిదిని మందలించింది.


పద్ధతి మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించింది. ఐతే అప్పటికే కామంతో కళ్లుమూసుకుపోయిన గంగిరెడ్డి తన కోరిక తీర్చాలంటూ వదినపై లైంగికదాడికి యత్నించాడు. హఠాత్పరిణామంతో బెంబేలెత్తిపోయిన బాధితురాలు మరిది గంగిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచారు. విచారణ జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ తుపాకీ చివర ఉండే కత్తిని తీసుకొని గొంతు కోసుకున్నాడు. పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఐతే పరిస్థితి కాస్త విషమించడంతో అతడ్ని ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. విషయం ఈ నోటా ఆ నోట బయటకు పొక్కింది. ప్రస్తుతం గంగిరెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు.