వాహనంలో చెలరేగిన మంటలు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 06:44 PM
 

అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద ఓమినీ వాహనంలో భారీగా మంటలు చెలరేగాయి. వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సహకారంతో ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. రాయదుర్గం వైపు నుంచి బళ్లారి వైపుకు వెళుతుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాహనం ఎవరిది అన్నది తెలియాల్సి ఉంది. ఇంజన్ తీవ్రంగా వేడెక్కి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.