ఏపీలోని ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 05:51 PM
 

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 55,525 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,174 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2037353కి చేరింది. కొత్తగా 9 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 14061 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,309 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2008639కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14653 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,76,52,514 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా గుంటూరు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు.. కడప, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకరంగా 208 మందికి వైరస్ సోకింది.