దళితజాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా..: హోం మంత్రి సుచరిత

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 05:39 PM
 

తాను దళితజాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని హోం మంత్రి సుచరిత అన్నారు. రాష్ట్ర రాజకీయాలకు టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు సరైన మనిషికాదు అని  హోం మంత్రి సుచరిత అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు ఇచ్చి సీఎం జగన్‌ను గొప్ప స్థానంలో కూర్చోబెట్టారని సుచరిత పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా అయ్యన్న ఘోరమైన భాష మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. సీఎంపై మీరు ప్రయోగించే భాష ఇదేనా అని ప్రశ్నించారు.


మహిళను పట్టుకుని అయ్యన్నపాత్రుడు సంస్కారం లేకుండా మాట్లాడారని సుచరిత ఆగ్రహం వ్యక్తం చేసారు. గొప్పతనం అనేది మన ప్రవర్తనను బట్టి వస్తుందని సుచరిత పేర్కొన్నారు. దళితజాతిలో పుట్టినందుకు తాను గర్వపడుతున్నాని సుచరిత స్పష్టం చేసారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడే హక్కు మీకెవరిచ్చారని సుచరిత ప్రశ్నించారు. మహిళల రక్షణపై మీకు చిత్తశుద్ధి ఉందా అని టీడీపీ నాయకులను, అయ్యన్నను సుచరిత నిలదీశారు.