భార్యను వేధిస్తున్న భర్త.. కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 05:16 PM
 

భార్య ఉండగానే మరొక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకుని భార్యను హింసలకు గురి చేస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం పోరంకి గ్రామానికి చెందిన దోనేపూడి కనకదుర్గని 2011 లో దేవరపల్లి సుధాకర్ అనే వ్యక్తి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇటీవల సుధాకర్ మరొక మహిళతో అక్రమ సంబంధ ఉంచుకొని భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.