పెరుగు తింటే ఎన్నో లాభాలు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 04:34 PM
 

పెరుగన్నం తింటే ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది దంతపుష్టికి, ఎముకల దృఢత్వానికి దోహద పడుతుంది.


- పెరుగు కీళ్ల నొప్పులను నివారిస్తుంది.


- కొందరు చిన్నారులు పెరుగన్నం తినడానికి ఇష్టపడరు. వారికి పెరుగు తినడం అలవాటు చేయాలి.


- పెరుగులో ఉన్న ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేట్లు చేస్తాయి.


- పెరుగులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్‌, పీచుపదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేట్లు చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


- పెరుగులోని మినరల్స్‌ వల్ల శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది.


- రోజు పెరుగు తినడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.


- నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది.


- పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని తెల్ల రక్తకణాలను పెరిగేలా చేస్తుంది. పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది.