ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 03:22 PM
 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూను ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.