"పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా'' అయ్యన్న గారు : సన్యాసిపాత్రుడు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 11:04 PM
 

అయ్యన్న నోటికొచ్చినట్లు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ నేత సన్యాసిపాత్రుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయ్యన్న మాటలు ఎవరూ సమర్థించే రీతిలో లేవన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమ పాలనను చూసి తట్టుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సన్యాసి పాత్రుడు అన్నారు. గంజాయి స్మగ్లింగ్‌ చేసే అయ్యన్న డాన్‌గా మారాడన్నారు. అయ్యన్న పాత్రుడు అక్రమాస్తుల చిట్టా తీస్తామని..


అందులో చంద్రబాబు వాటా ఎంతో తేలుస్తామన్నారు. 'నిన్న మాట్లాడేటప్పుడు అయ్యన్న ఎన్ని పెగ్గులు వేశాడు?. పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా'' అంటూ సన్యాసిపాత్రుడు ఎద్దేవా చేశారు.