మహిళలను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న సైబర్ నిందితుల అరెస్ట్

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 10:37 PM
 

మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్నూలు  జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకొని యువతులు, మహిళలపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న నిందితులను అరెస్ట్‌ చేసామని ఆయన పేర్కొన్నారు. ఒక నెలలోనే జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో అపరిచితులను నమ్మి మహిళలు మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.