సీఎం జగన్‌ను తిట్టలేదు.. ఓ మై సన్ అన్నానంతే.. : అయ్యన్నపాత్రుడు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 10:07 PM
 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వార్తలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు స్పందించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభలో తాను సీఎం జగన్‌ను తిట్టలేదని వివరణ ఇచ్చారు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలపై కావాలనే వైసీపీ శ్రేణులు రచ్చ చేస్తున్నాయని విమర్శించారు. నీటి పారుదల, పౌరసరఫరా మంత్రుల పనుల మేరకే సంబోధించానని చెప్పుకొచ్చారు. తన మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో వైసీపీ నేతలే సమాధానం చెప్పాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.