వారి మాటలు వింటే "దెయ్యాలు వేదం వల్లిస్తున్నట్లు"గా ఉంది : స్పీకర్ తమ్మినేని

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 08:00 PM
 

టీడీపీ నాయకుల మాటలు వింటే దెయ్యాలు వేదం వల్లిస్తున్నట్లుగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు రైతులపై లాఠీ ఛార్జ్, ఫైరింగ్ జరిగిందని, దానిని ఎవ్వరూ మరచిపోలేదన్నారు. అందుకే రైతు భరోసా కేంద్రాలను జగన్ ఏర్పాటు చేసారన్నారు. రైతులే తమకు ఏమి కావాలో బుక్ చేసుకొంటున్నారని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారటూ టీడీపీ రోడ్డెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.


టీడీపీ వాళ్ల మాటలు వింటే దెయ్యాలు వేదం వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. గడచిన తమ పాలనలో రైతులకు ఏమి చేసారో చెప్పాలని టీడీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను స్వీప్ చేస్తున్నామన్నారు. టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు.