కాకినాడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 06:00 PM
 

కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్‌-1 సత్తిబాబుపై కౌన్సిలల్‌ మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించి కలెక్టర్‌ హరికిరణ్‌కు 33 మంది కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇటీవలే మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకోగా.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తీరుతో టీడీపీ పట్ల ఆపార్టీ కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేశారు.