జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు.. నివాసం వైపు వెళ్లే అన్నిదారులను మూసివేత

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 05:45 PM
 

సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్నిదారులను పోలీసులు మూసివేశారు. సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సీఎం నివాస మార్గాల్లో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోన సీఎం జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.