ఘోర రోడ్డు ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 04:42 PM
 

గుంటూరు: చెల్లిని పరీక్షకని తీసుకెళుతుండగా రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చెల్లెలిని ఇంటర్ పరీక్ష కోసమని బైక్‌పై అన్న తీసుకెళుతుండగా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఒక లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే అన్న మృతి చెందాడు. చెల్లెలికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.