వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 04:17 PM
 

గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం తొండపిలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. గురువారం కోడెల వర్థంతికి వెళ్లారనే నేపంతో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు, కత్తులతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో ఆరుగురికి గాయాలు కాగా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.