ఏపీలో కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 03:47 PM
 

ఏపీలో కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామక మయ్యారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీజే(చీఫ్ జస్టిస్)గా కొనసాగిన అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయ్యారు. ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇంతవరకూ సేవలందించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సీజేగా వచ్చారు. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు షురూ అయ్యాయి. కాగా, గత నెల ఆగష్టు 31న సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.