ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 01:38 PM

తమిళనాడులోని కాంచీపురంలో ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకునే సీన్‌ సినిమా సీన్‌ ను తలపించింది. ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. కాంచీపురంలో కార్ల దొంగతనాలు పెరిగిపోయాయి. వీటిని చోరీ చేస్తోంది వెంకటేష్ గ్యాంగ్ అని తెలుసుకుని, ఆ గ్యాంగ్‌ సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తంజావూర్ జిల్లా పట్టుకోట్టైలో పోలిసుల తనిఖీలలో దొంగిలించిన కారుని గుర్తించారు. అంతేకాదు ఈ కారును దొంగలించిన వెంకటేష్‌ గ్యాంగ్‌ సభ్యుడిని పట్టుకునేందుకు పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రశాంత్‌ ప్రయత్నించాడు. పరుగెడుతూ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. చేజింగ్‌ వీడియోలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వైరల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com