ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటల్ గదిలో ప్రియురాలితో భర్త.. షాకిచ్చిన భార్య

international |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 01:35 PM

కట్టుకున్న భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ వ్యక్తి తన సంసారాన్ని పాడు చేసుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన జాంగ్ ఓ కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతడు తన భార్యతో కలిసి ఆక్లాండ్ లో నివాసం ఉంటున్నాడు. జాంగ్ తాను పనిచేనే కంపెనీలోనే పనిచేసే నాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నాన్సీతో కలిసి జాంగ్ గత వారం బిజినెస్ ట్రిప్ పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లాడు.


ఓ హోటల్ లో ఇద్దరూ కలిసి రూమ్ తీసుకున్నారు. అయితే జాంగ్ భార్య అతడిని సర్ ప్రైజ్ చేద్దామని ఆస్ట్రేలియాకు వెళ్లింది. తమ పెళ్లి రోజు సందర్భంగా అతడితో ఏకాంతంగా గడపాలనుకుంది. తన భర్త బస చేస్తున్న సిడ్నీలోని హోటల్ కు బయలు దేరింది. భర్త ఉన్న గదికి వెళ్లి డోర్ బెల్ కొట్టింది. అప్పుడే జాంగ్ డోర్ కన్నంలో నుంచి భార్యను చూసి షాకయ్యాడు. తన ప్రియురాలిని బాత్రూంలో దాక్కొమని చెప్పాడు. డోర్ తెరిచి భార్యను ఆహ్వానించాడు. ఆమెను రెస్టారెంట్ కు వెళ్దామని బలవంతం చేశాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఇద్దరం ఏకాంతంగా గడుపుదామని బలవంతం చేసింది. చేసేది లేక జాంగ్ తన భార్యతో కలిసి శృంగారంలో మునిగిపోయాడు.


కాసేపయ్యాక బాత్రూంలో దాక్కున్న నాన్సీ వరుసగా మెసేజీలు చేసింది. అయితే అనుమానం వచ్చిన జాంగ్ భార్య తన భర్త ఫోన్ లోని మెసేజీలను చెక్ చేసింది. నాన్సీ బాత్రూంలోనే దాక్కొని ఉందని గుర్తించింది. దీంతో తన భర్త, అతడి ప్రియురాలితో తీవ్ర స్థాయిలో గొడవ పడింది. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత జాంగ్ భార్య తనకు విడాకులు ఇవ్వమంటూ కోర్టును ఆశ్రయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com