విస్తృతంగా వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 01:33 PM
 

విజయనగరం: శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గురువారం సాయంత్రం కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ వీర జనార్ధన్ విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం నుండి వస్తున్న వాహనాలతో పాటుగా శృంగవరపుకోట నుండి వస్తున్న వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి పత్రాలు సరిగా లేని వాహనాలకు అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో కొత్తవలస పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.