ఓ డాక్టర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో శృంగారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలతో ఇప్పుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బనస్కాంత జిల్లాలోని వడ్గామ్ తాలుకాలోని పీహెచ్సీలో పనిచేస్తున్న డాక్టర్ అనిల్ ధాబి తనతో సంబంధం పెట్టుకుని శారీరకంగా హింసించాడని మహిళ టీచర్ ఆరోపించింది. 2012 లో అతడితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, 2013 నుంచి ఆ డాక్టర్తో తనకు సంబంధాలు లేవని ఆ మహిళా టీచర్ తెలిపింది. తనపై అత్యాచారం జరిపిన సమయంలో అనిల్ వీడియోలు రికార్డు చేశాడని, ఇటీవల ఆ వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పింది. గెస్ట్ హౌస్కు పిలిచి తనపై దాడి చేశాడని చెప్పింది. అతడు చెప్పినట్టుగా చేయకపోతే ఆ వీడియోలను తన భర్తకు పంపుతానని బెదిరించినట్టు ఆ టీచర్ తెలిపారు.
అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ టీచర్ పోలీసులను ఆశ్రయించింది. తన మర్యాదకు భంగం కలిగించేలా బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.