చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 12:54 PM
 

ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీఎం జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జోగి రమేష్, బుద్ధ వెంకన్న ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.