చెరువులో తల్లి, కొడుకుల మృతదేహాలు లభ్యం

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 12:23 PM
 

కర్నూలు జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని చిన్న చెరువులో తల్లి కొడుకుల మృతదేహాలు లభ్యమైనట్లు ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. మృతులు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన చిన్నెం మాధవి (26), నాగ పూజిత్ వారిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సంజమాల ఎస్సై తిమ్మా రెడ్డి తెలిపారు.