ప్రధాని మోడీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య పుట్టిన రోజు శుభాకాంక్షలు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 10:03 AM
 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 71వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. ప్రధాని మోడీకి జన్మదిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అపారమైన కృషి, సమర్థ నాయకత్వం, అంకితభావం దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపుతున్నది. మీరు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా. అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.