బస్సులో యువతికి ముద్దులు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 09:36 AM
 

బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని కాగా, బుధవారం రాత్రి 10:40కి బళ్లారిలో కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఎక్కింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది.ఈ సమయంలో ఓ యువకుడు పదేపదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. మెలకువ వచ్చి చూస్తే ఎవరో గుర్తించలేక పోయింది. భయపడిన యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు.