అనంతపురం లో అంతర్గతంగా టీడీపీలో లుకలుకలు

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 10:57 PM
 

అనంతపురం జిల్లా టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. టీడీపీ కార్యాలయంలో బండారు శ్రీవాణి వర్గీయులు, కాల్వ శ్రీనివాసులు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీల పెత్తనమేంటని వాదించుకున్నారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయానికి పోలీసులు చేరుకున్నారు. కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలను పోలీసులు బయటికి పంపుతున్నారు.