నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు స్పీకర్ తమ్మినేని ఛాలెంజ్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 07:51 PM
 

నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ చైతన్య, నారాయణ అంటూ తల్లిదండ్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారని ప్రశ్నించారు. ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు పూర్తిస్థాయి విద్యార్హత లేదని ఆరోపించారు. అక్కడంతా ఏబీసీడీఎఫ్ అని బట్టీ పడ్డించడమే తెలుసని విమర్శించారు. అంతేకాదు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు తమ్మినేని సవాల్ విసిరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంచి శిక్షణ కలిగిన వారని కొనియాడారు. కింతలిలోని జెడ్పీహెచ్ స్కూల్‌లోని టీచర్లతో పోటీకి రావాలంటూ నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు తమ్మినేని ఛాలెంజ్ విసిరారు.