ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లా: మంత్రి బాలినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 15, 2021, 07:00 PM

నా  స్నేహితుడి పుట్టినరోజు కోసం రష్యా వెళ్లానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయలు పెట్టి వెళ్లానని ప్రచారం చేశారని తప్పుబట్టారు. పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడని తెలియగానే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని విమర్శించారు. ''రెండు నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో మారిషస్ వెళ్లారు. రెండు ఎకరాలు పొలం నుండి వచ్చిన వ్యక్తి ఏ పర్యటనకైనా వెళ్లవచ్చు. ల్యాండ్ సీలింగ్స్‌లో వందల ఎకరాలు పోగొట్టుకున్న మేము ఏ పర్యటనకు వెళ్లకూడదా? దాపరికాలు లేకుండా రష్యా పర్యటన గురించి నేనే ట్వీట్ చేశా. దొంగచాటుగా పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చెన్నై హవాలా అంటారు.. నోటికొచ్చిన అబద్ధాలు చెబితే ప్రజలు సహించరు'' అని బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com