నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 06:24 PM
 

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించారు. ఉదయగిరి టౌన్‌లో స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిని కాటికాపరి వేషంలో ఉన్న ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. చిన్నారిని పట్టుకుని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించారు. ఆ ముగ్గురును పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఉదయగిరి సీఐ గిరిబాబు తెలిపారు. కిడ్నాప్‌కు ఎందుకు ప్రయత్నించారు..కిడ్నాప్ వెనుక ఎవరి హస్తం ఉంది అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.