ప్రేమించినవాడి కోసం భర్త, బిడ్డలను వదులుకుంది..చివరికి షాక్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 03:29 PM
 

వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. పెళ్లికి ముందే ఓ వ్యక్తిని ఇష్టపడిన మహిళ మరొక ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ అతడితో కాపురం చేస్తున్నా ప్రియుడ్ని మరిచిపోలేకపోయింది. దీంతో భర్తను వదిలేసింది. తరువాత తన ప్రియుడితో సహజీవనం చేసింది . ఎనిమిదేళ్ల పాటు హ్యాపీగా సహజీవనం చేశారు. కానీ ఇప్పుడుపెళ్లి చేసుకోమని అడుగుతోందన్న కోపంతో ఏకంగా ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడలేదు ఆ ప్రియుడు. కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నించడంతో తీవ్రగాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బాధిత మహిళ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ బొరిగిపేట గ్రామానికి చెందిన రైల్వే గ్యాంగ్‌మెన్‌ సంపతిరావు దేవరాజ్‌ అనే వ్యక్తి.. గంగాధరపేట గ్రామానికి చెందిన మహిళతో ఘర్షణ పడి కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో తలకు, మెడ, చేతులపై గాయపడింది. గట్టిగా కేకలు వేయడంతో దేవరాజ్ పారిపోయాడు. దీంతో బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని గ్రామస్తుల సాయంతో టెక్కలి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. నిందితుడు దేవరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు. మొత్తానికి ప్రియుడిని నమ్ముకుని భార్యాబిడ్డలను వదిలేసిన వచ్చిన మహిళ చివరికి నమ్మి వచ్చిన వ్యక్తి చేతిలోనే కత్తి గాట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన ప్రాణాలతో పోరాడుతోంది.