దరువేస్తూ సందడి చేసిన నగరి ఎమ్మెల్యే రోజా

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 05:04 PM
 

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజు సందడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏపని చేసిన హంగామా ఉంటుంది. గతంలో అంబులెన్స్ నడిపారు.. స్కూటర్ పై సవారీ చేశారు.. తాజాగా డప్పు కొట్టి దరువేశారు. ఇటీవల నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందని వారికి హామీ ఇచ్చారు. సుమారు ఏడు వందల మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పులు, డ్రెస్సులు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర వారికి సంబంధించి వస్తువులను ఎమ్మెల్యే రోజా స్వయంగా అందచేశారు.