అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్: ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 03:55 PM
 

ఆగస్టు 15న స్వాంత్రత్య దినోత్సవం సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్ల కోసం గ్రేట్ సేల్ ను తీసుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో వస్తున్న ఈ సేల్ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు. కేవలం 5 రోజుల పాటు ఉండే ఈ సేల్ లో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్ ను ఆర్డర్ చేయాలనుకునే వాళ్లకు అయితే నిజంగా పండగే. మొబైల్స్, వాటి యాక్సెసరీస్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ ను ఈ సేల్ లో అమెజాన్ అందించనుంది. ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్ మీద 60 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. టీవీలు, వాటి అప్లయెన్సెస్ కు 55 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ప్రాడక్ట్ ను బట్టి రకరకాల డిస్కౌంట్లను ఈ సేల్ లో అందించనున్నారు.


ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆర్డర్ చేస్తే.. సేల్ ద్వారా వచ్చే డిస్కౌంట్ తో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను అందించనున్నారు. కొత్త లాప్ టాప్ కొనాలనుకునే వాళ్లకు ప్రత్యేకంగా 30 వేల వరకు డిస్కౌంట్ ను ఈ సేల్ లో అందిస్తున్నారు. ప్రింటర్ లాంటి యాక్సెసరీస్ మీద 30 శాతం డిస్కౌంట్ లభించనుంది.


అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న కస్టమర్లకు మూడు నెలల ఎక్స్ ట్రా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పించారు. కొత్త లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్ నోర్డ్ 2, వన్ ప్లస్ నోర్డ్ సీఈ 5జీ, సామ్ సంగ్ ఎం21 2021, ఐక్యూఓఓ జెడ్3, 5జీ ఫోన్ల మీద ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు.