ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మేడ్ ఇన్ ఇండియా రియల్ మీ ఫోన్లు

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 03, 2021, 03:24 PM
 

ఒకప్పుడు టెక్నాలజీకి సంబంధించి ఏ వస్తువునైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరిస్థితి మనది. అది కూడా ఒక అంతర్జాతీయ బ్రాండ్ తన ఉత్పత్తులను విడుదల చేసిన నాటి నుంచి ఎప్పటికోగానీ మన దేశంలో వాటి విక్రయాలు ప్రారంభమయ్యేవి కావు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో తమ ఆవిష్కరణల ఉత్పత్తులను ప్రారంభించడానికి బడా సంస్థలు ముందుకొస్తున్నాయి. యాపిల్, రియల్ మీ లాంటి సంస్థలు భారత్ లో తమ ఉత్పత్తులను ప్రారంభించి దేశీయంగా అమ్మకాలు చేపట్టాయి. తాజాగా రియల్ మీ సంస్థ తన భారత్ లో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను నేపాల్‌కు ఎగుమతి చేయనుంది.దేశంలో టాప్ 4 బ్రాండ్.. ఇప్పుడు ఎగుమతులపై దృష్టి.. 


భారత్‌లో 14.6 శాతం వాటాతో టాప్ స్మార్ట్ ఫోన్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న రియల్‌మీ ఇప్పుడు తన ఉత్పత్తులను నేపాల్‌కు ఎగుమతి చేయనున్నట్టు ప్రకటించింది. నేపాల్ మార్కెట్‌ను కీలకంగా భావిస్తున్న రియల్ మీ అక్కడి అవసరాలకు తగ్గట్టు వియోగదారులకు చేరువయ్యేదుకు ప్రయత్నిస్తోంది. 2021 మూడో క్వార్టర్ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. అందుకు అనుగుణంగా నేపాల్ కార్యకలాపాలను కంపెనీ వైస్ ప్రెసిడెంట్, భారత్, యూరప్ సీఈవో మాధవ్ సేథ్ పర్యవేక్షించనున్నారు.