శ్రీకాకుళం జిల్లాలో మహిళా దొంగల ముఠా హల్ చల్

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 01:20 PM
 

శ్రీకాకుళం జిల్లా రాజాంలో మహిళా దొంగల ముఠా హల్ చల్ చేసింది. ఈనెల 27 న సాయికిరణ్ జ్యూయలరీలో చోరీ చేసిన ఈ దొంగల ముఠా.. మళ్ళీ మరోసారి చోరీ కి ప్లాన్ చేశారు. అయితే అప్పటికే తన షాప్ లో దొంగతనం జరిగిందని జ్యూయలరీ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళా దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్లాన్ చేశారు. దొంగలను సినీ స్టైల్ లో వెంబడించి రాజాం పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. దీంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


పారిపోయిన ముగ్గురు కారులో విశాఖ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. విశాఖ పోలీసులకు రాజాం పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖ పోలీసులు సినీస్టైల్లో కారుతో సహాదొంగలను ట్రాక్ చేశారు. వారిని రాజాం పోలీసులకు అప్పగించారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జ్యూయలరీ షాపులను టార్గెట్ చేసిన దొంగ ముఠా చోరీలు చేస్తుంది. ఈ ముఠా బంగారం షాపు లో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి.. అసలు బంగారం ఎత్తుకెళ్తుంది. ఈ మహిళా దొంగల ముఠా ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వారీగా గుర్తించారు.