అత్తా కోడళ్లు అంటే కలహాలు,విబేధాలు గుర్తోసాయి. అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. కానీ ఓ కోడలు మాత్రం తాను అందుకు భిన్న అంటూ.. తన అత్తగారిపై ప్రమేను చూపించింది. కోడలు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.
ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు.
వంటలు చేయడం కూడా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా.. అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు.. 60 రకాల వెరైటీ వంటలను చేసి అత్తగారికి కానుకుగా ఇచ్చింది. 60 రకాల వెరైటీల అని షాక్ అవ్వకండి అది నిజమే. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.