ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిజ్రాగా మారి మోసపోయిన యువతి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 24, 2021, 12:11 PM

హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో ఓ యువతి హిజ్రాగా మారింది. హిజ్రాగా మారాక సదరు మహిళ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని కడపలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.


కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ప్రభుత్వ అధికారులు ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. ట్రైనింగ్ సమయంలో అక్కడే శిక్షణ పొందుతున్న మరో మహిళతో యువతికి పరిచయం ఏర్పడింది. వారిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. సదరు యువతికి అబ్బాయి లక్షణాలుండటంతో హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని.. మహిళ యువతిని బలవంతపెట్టింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది.


కొంతకాలం ఇద్దరు కలిసి జీవించారు. ఈ క్రమంలో హిజ్రాను పెళ్లాడతానంటూ మహిళ తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మహిళ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి తనను మోసం చేసిందని, తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కడప జిల్లా పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com