పొంగిపొర్లుతున్న వాగు.. రాకపోకలు బంద్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 22, 2021, 04:03 PM
 

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా ఎడతెరపు లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజగా కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో రెండు రోజులుగా అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షానికి రహదారులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. గంపలగూడెం శివారు వినగడప వద్ద కట్లెరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కట్లెరు వాగు ఉధృతి కారణంగా దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గే వరకు వాగు దాటవద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.