రైతులు అధిక దిగబడి సాధించాలి: ధర్మాన కృష్ణదాస్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 08, 2021, 03:29 PM
 

శ్రీకాకుళం: అధిక దిగబడి సాధించాలనీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతులకు పిలుపు నిచ్చారు. రైతు దినోత్సవము సందర్భముగా రాజాంలో వై.యస్.ఆర్ ఆగ్రి లాబ్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. జిల్లాలో 134 రైతు భరోసా కేంద్రాలను, 140 వై.యస్.అర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించారు. రాజాం, ఆమదాలవలస, రణస్థలం, కొత్తూరులలో వై.యస్.ఆర్ ఆగ్రి లాబ్ ల ప్రారంభించారు. ఒక్కో వై.యస్.ఆర్ ఆగ్రి లాబ్ ను రూ.61 లక్షలతో, ఒక్కో రైతు భరోసా కేంద్రాన్ని రూ.21.80 లక్షలతో నిర్మించారు. వై.యస్.ఆర్ యంత్ర సేవా కేంద్రాల పరికరాలను ప్రారంభించారు.  ఈ సంధర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ మాట్లాడుతూ రైతుకు ఆత్మ స్థైర్యం కల్పించే ప్రభుత్వం అన్నారు. శ్రీకాకుళం ప్రధానంగా వ్యవసాయక జిల్లా అని తెలిపారు. రైతులు తమ అనుభవంతో యంత్ర పరికరాలు ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ముఖ్య మంత్రి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా పాలిస్తున్నరని చెప్పారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతు రైతు దినోత్సవము రైతులకు పండగ రోజు అన్నారు. రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారని పేర్కోన్నారు. జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయమే సంస్కృతిగా మలచుకొన్నారని చెప్పారు. యంత్ర పరికరాల ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయం చేయాలని యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారనీ ఆయన అన్నారు. జిల్లాలో బయలాజికల్ కంట్రోల్ లాబ్ నిర్మిస్తున్నామని తెలిపారు. అర్.బి.కెలలో వ్యవసాయంతో పాటు పశువుల సంభందిత సేవలను అందించడం జరుగుతుందనీ అన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం కానుందని అన్నారు. ముఖ్య మంత్రి వ్యవసాయం పై ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తున్నారని స్పీకర్ అన్నారు.  శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ రాజశఖరరెడ్డి జయంతి ని రైతు దినోత్సవము నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి అనేక కార్య్రమాలను చేపడుతుందన్నారు. లాబ్ లు రాబోయే రోజుల్లో కీలక పాత్ర వహిస్తాయని ఆయన చెప్పారు. రైతు లకు విత్తనం నుండి విక్రయం వరకు అర్.బి.కె లు ఉపయోగపడతాయన్నారు. యంత్ర సేవా కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఖరీఫ్ కు గొట్టా, మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నుండి సాగు నీరు విడుదల చేయడం జరిగిందనీ తెలిపారు.  ఈ సందర్బంగా రైతు అవగాహన పోస్టర్లను ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ విడుదల చేశారు. ఉత్తమ రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు కరిమి రాజేశ్వర రావు, డిసిసిబి మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, మండల ప్రత్యేక అధికారి దా.జగన్నాథం, మార్కెటింగ్ ఎడి బి. శ్రీనివాస రావు, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు.