నేడు గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 14, 2021, 10:06 AM
 

అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై గవర్నర్‌తో సీఎం చర్చించే అవకాశం ఉంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలపై ఏర్పడ్డ సందిగ్ధంను తొలగించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం పంపిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పేర్లపై గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపని విషయం తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలను కూడా గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది.