ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 02:03 PM
 

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. విమానాశ్రయంలో వీఐపీ గేట్ లోపలకు రానీయకుండా కేంద్ర భద్రత సిబ్బంది తోసేశారు. దీంతో మంత్రి బుగ్గన.. పీయూష్ గోయల్‌కు వీడ్కోలు పలకలేక పోయారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారు. అయితే విమానాశ్రయ అధికారులు మంత్రిని సర్దుబాటు చేసి పంపించారు.