ఏపీ సీఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 01:35 PM
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీనిని ఫోటో తీసి వాట్సఫ్ గ్రూపులో పోస్టు పెడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా..దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.